శ్రీదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 22 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు దేవీ చౌక్ లో 92వ నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు భక్తుల రాజేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో జరిగిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ ఉత్సవాలు 21న దేవి విగ్రహ ప్రతిష్ట మరియు కలశ స్థాపనతో కార్యక్రమం ప్రారంభం అవుతుందన్నారు.