నల్లగొండ జిల్లా: కుటుంబ పెద్ద చనిపోయిన పరిస్థితుల్లో కుటుంబానికి సహకారంగా జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద ఒకేసారి 20వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని పొందవచ్చు అని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ పథకానికి అర్హులైన వారిని దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలన్నారు. శనివారం ఆమె చండూరు తహసిల్దార్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ 59 సంవత్సరాలలోపు వయసు ఉన్న కుటుంబ పెద్ద ఒకవేళ ఏదైనా కారణం చేత మరణించి ఉంటే జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి అతి పెద్ద కుటుంబం అర్హులని ఈ పథకం కింద అవసరమైన ధృవపత్రం చేస్తూ దరఖాస్తు చేసుకుంటే వారం రోజులు 20 వేల రూపాయలు జమవుతాయన్నారు.