అనంతపురం నగరానికి చెందిన విద్యార్థి అదృశ్యమైనట్లు ఆదివారం తెల్లవారుజామున నగరంలోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. నగర శివారులోని ఏ నారాయణపురం పంచాయతీ పరిధిలో ఉన్న ప్రహల్లాద నగర్ కు చెందిన బచ్చలి ఈక్షిత్ ఫనీంద్ర అనే 13 ఏళ్ల బాలుడు శనివారం ఉదయం పాఠశాలకు అని చెప్పి హాస్టల్ నుంచి వెళ్లినట్లు వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. నగరంలోని మూడవ పట్టణ పోలీసులు ఈ అంశానికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు.