సూర్యాపేట జిల్లా చివ్వెంలా మండల కేంద్రంలోని పనుల జాతర కార్యక్రమానికి శుక్రవారం కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ హాజరై ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ఉపాధిని మెరుగుపరచడానికి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తేజ నందాలాల్ పవర్ తెలిపారు.