పెట్రోల్ బంక్ యజమాని నిర్లక్ష్యం.. నీట మురిగిన వరి పంట కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టుకు చెందిన బాగోతం రజిత, కొమరయ్య లకు గొల్లపల్లి జాతీయ రహదారి పక్కన 26 గుంటల భూమి ఉంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఎగువ నుండి దిగువకు వెళ్లే దారికి అడ్డుగా ఓ పెట్రోల్ బంక్ యజమాని మొరం వేయడంతో పంట పొలంలోకి వరద వెళ్లి చెరువును తలపిస్తుందని వారు తెలిపారు. అధికారులు స్పందించి వర్షపు నీరు దిగువకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.