సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం కొత్తూరు డి వద్ద 65వ నెంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి జహీరాబాద్ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ కొత్తూరు డి వద్ద ఆగి ఉండగా అదే రూట్ లో వెనుక నుండి వెళ్తున్న బైక్ ఢీ కొట్టినట్లు తెలిసింది ప్రమాదంలో బైక్ పై వెళుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, పోలీసులు అంబులెన్స్ సహాయంతో క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించారు.ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.