మోసానికి గురైన రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్, SP ఆదేశాలతో పోలీసుల ద్వారా 2 నెలల తర్వాత న్యాయం జరిగింది. వివరాల్లోకి వెళితే కణేకల్ మండలం సొల్లాపురం, హనకనహల్, పూలచర్ల, హనుమాపురం గ్రామాలకు చెందిన 25 మంది రైతులు ఓ వ్యాపరి రూ.23 లక్షలు ఇవ్వకుండా మోసం చేశాడు. దీనిపై కలెక్టర్ కు పిర్యాదు చేయడంతో సిఐ వెంకటరమణ ద్వారా మంగళవారం వారికి న్యాయం చేశారు. డబ్బు వచ్చేలా చేశారు. రైతులు కృతజ్ఞతలు తెలిపారు.