చిత్తూరు టూటౌన్ పోలీసులు కలెక్టర్ సుమిత్ కుమార్ పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు తెరిచిన నకిలీ ఫేస్బుక్ ఖాతాపై శుక్రవారం కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్లు ఇలా నకిలీ ఖాతాలు సృష్టించి, ఖాతాదారుల సన్నిహితులకు అత్యవసరంగా నగదు కావాలని సందేశాలు పంపి మోసగిస్తున్నారు. కలెక్టర్ ఫేస్బుక్ ఖాతాను నకిలీది సృష్టించిన సైబర్ నేరగాళ్లు, నివాసంలో ఉన్న ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ పరికరాలు విక్రయిస్తున్నట్లు సందేశం పెట్టారు. దీన్ని గుర్తించిన కలెక్టర్ తన సన్నిహితులందరినీ అప్రమత్తం చేస్తూ పోస్టు పెట్టారు. పభ్రజలు మోసపోవద్దని సూచించారు. కలెక్టర్ కార్యాలయ ఏవో వాసుదేవన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్