హిందూ పండుగలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం ఆరోపించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం కమలాపూర్ చెరువును ఆయన పరిశీలించారు. నిమజ్జన ఏర్పాట్లపై అసహనం వ్యక్తం చేశారు. నిమజ్జన కార్యక్రమం నిర్వహించే ప్రాంతం వద్ద విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం, క్రేన్ల ఏర్పాటు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ పాల్గొన్నారు.