మహ్మద్ ప్రవక్త జన్మించి సుమారు 1500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మహమ్మద్ ప్రవక్త జన్మదిన మహోత్సవాన్ని పురస్కరించుకొని నగరంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలను, మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఖాళీదే గుల్షన్ బొంబాయి స్కూల్లో ఆసారే ముబారక్ దర్శనం అనం తరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. హుస్సేనీపుర బొంబాయి స్కూల్ నుంచి మొదలై నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, డిఎఫ్ఎ చౌరస్తా, గీతా భవన్ చౌరస్తా బస్టాండ్, వన్ టౌన్ పోలీస్ స్టేష న్ ఎదురు నుంచి తెలంగాణ అమర వీరుల స్థూపం మీదుగా రాజీవ్ చౌక్ కరీ ముల్లాషా దర్గా వద్ద సాయంత్రం ముగిసింది.