సఖినేటిపల్లి మండలం, అంతర్వేది చుట్టుపక్కల గ్రామాలకు చేరిన ముంపు నీటిని సముద్రం లోకి పంపింగ్ చేసే ఏర్పాట్లను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపు నీరు డ్రెయిన్లలో ప్రవహించక వరిపొలాలు, ఇళ్లు ముంపునకు గురవుతున్నాయనే స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ సమస్యను పరిష్కరించేందుకు రైతుల సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.