ఈనెల 29 30 తేదీలలో కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని ఆయన పాల్గొనే ప్రదేశాలలో పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు గురువారం ముఖ్యమంత్రి భద్రత అధికారుల ఆధ్వర్యంలో ఏఎస్ఐ సమావేశం నిర్వహించారు. పరమచెరువు సముద్రం నందు బహిరంగ సభ హంద్రీనీవా కాలువ ద్వారా జలహారతి పైలాన్ పనులను పరిశీలించారు బహిరంగ సభ వద్ద సుమారు 7000 మంది హాజరుకానున్నారని అధికారులు భద్రత ఏర్పాట్లు క్షుణ్ణంగా చేయాలన్నారు హెలిపాడ్ వద్ద బహిరంగ సభ వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ డి ఎం హెచ్ ఓ ను ఆదేశించారు