దివ్యాంగులు, వృద్ధులకు పింఛన్ పెంచుతామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ రాజ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట వీహెచ్పీ, ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆసరా పింఛన్దారుల మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలవుతున్నా పింఛన్లు పెంచలేదని ఆరోపించారు.