మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పట్టణానికి చెందిన రామచందర్ అనే వ్యక్తి పెద్ద శంకరంపేట నుండి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. కాశ్మీర్ లోని శివాలయానికి వెళ్లి వెండి త్రిశూలాన్ని సమర్పించనున్నట్లు తెలిపాడు. సైకిల్ యాత్రను పెద్ద శంకరంపేట కాంగ్రెస్ అధ్యక్షుడు గంగారెడ్డి పూలమాలవేసి ప్రారంభించారు.