కర్నూల్ నగరంలో భారీ వర్షం కురిసింది. బుధవారం ఉదయం నుండి ఒకవైపు ఎండ మరోవైపు తొలకరి చినుకులతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా బుధవారం రాత్రి 7 గంటలకు నుండి సుమారు గంటపాటు వర్షం కురిసింది. దీంతో కర్నూలు నగరంలోని రాజ్ వీహర్, సి క్యాంప్ సెంటర్ నంద్యాల్ చెక్పోస్ట్ ప్రాంతాల్లో రోడ్లపైకి వర్షపు నీరు చేరుతుంది. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు.