Parvathipuram, Parvathipuram Manyam | Dec 29, 2024
పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం లో జరుగుతున్న కందికొత్తలు పండుగలో ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో అపశృతి చోటుచేసుకుంది. వేడి రసం లో పడి చెముడుగూడ గ్రామానికి రమేష్ అనే వ్యక్తి ఒళ్ళంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో జిల్లా ఆస్పత్రికి తరలించారు.