ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా, ఎక్కడైనా ఆపద వచ్చినా ఆదుకోవడంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ముందుంటుందని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నేపాల్‌లో మారణోమంలో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలను సురక్షితంగా తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ చేసిన కృషి అభినందనీయమని ఆయన ప్రశంసించారు.రియల్ టైం గవర్నెన్స్ వార్‌రూమ్ ద్వారా బాధితులతో ఎప్పటికప్పుడు మాట్లాడి సహాయక చర్యలు చేపట్టిన లోకేష్, ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్న బాధ్యతను మరోసారి చాటి చెప్పారని పేర్కొన్నారు. గతంలోనూ ఉత్తరాఖండ్ వరదలు, గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రజలన