జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ శుభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులను ఘనంగా జరుపుకుంటూ గణనాథుడి శోభాయాత్ర గంగమ్మ వడికి చేరుతున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఐకమత్యంతో, ఆనందోత్సాహాలతో శోభాయాత్రను నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంప్రదాయాలు, సాంప్రదాయ విలువలు కాపాడేలా ఇలాంటి వేడుకలు 9 రోజులు పాటు భక్తి శ్రద్ధలతో ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా నిర్వహించారని తెలిపారు. నిమజ్జనం ఎ