ఆళ్లగడ్డలో రోజురోజుకూ పెరిగిపోతున్న కుక్కల బెడదపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఇటీవల కాలంలో కుక్కల బెడద ఎక్కువ కావడంతో అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. కమిషనర్ కిశోర్, మున్సిపల్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి, కుక్కల బెడదను నివారించాలని ఆదేశించారు.