అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి నిర్మల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం అమావాస్య తిథి పురస్కరించుకొని నిర్మల్‌లోని నాగమాత దేవాలయ ప్రాంగణంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.దాతలుగా అరె హారిక,రమాకాంత్‌లు వ్యవహరించారు. అన్నదానం మహాదానమని, అమావాస్య రోజున అన్నదానం చేయడం పితృదేవతలను స్మరించడంతో సమానమని సమితి నిర్వాహకులు తెలిపారు