నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగే మార్గాన్ని శుక్రవారం ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ప్రజలు శాంతియుతంగా నిమజ్జనోత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. భద్రతాపరంగా ఇబ్బందులు కలకుండా శోభాయాత్రలో పోలీసులు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యేక డైవర్షన్ ప్రణాళికను అమలు చేయాలని సూచించారు. అనంతరం బంగల్ పేట్ వినాయక సాగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు పరిశీలించారు. ఇందులో ఏఎస్పీ రాజేష్ మీనా, పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ తదితరులున్నారు.