ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో అధికారులు శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.