చిత్తూరు: మరికాసేపట్లో పవర్ కట్ చిత్తూరులోని పలు ప్రాంతాల్లో ఆదివారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ట్రాన్స్కో ఈఈ మునిచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. సంతపేట, డీఐరోడ్డు, హైరోడ్డు, బజారువీధి, చవటపల్లె ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు. దీనిని వినియోగదారులు గమనించాల్సిందిగా కోరారు.