ములుగు మండలం కాసిందేవిపేట గ్రామ పంచాయతీ పరిధిలోని రామయ్య పల్లి గ్రామ సమీపంలో పంట పొలాలను అడవి పందులు నాశనం చేశాయి. అదే గ్రామానికి చెందిన భూక్య అమర్ సిoగ్ అనే రైతు తన భూమిలో ఎకరం 20 గుంటలు పత్తి సాగు చేయడం జరుగుతుంది. ఈ పంట సాగు చేసుకోవడానికి లక్ష రూపాయలు ఖర్చు వచ్చిందని, అట్టి పత్తి పంట కాయ వచ్చే దశలో అడవి పందుల గుంపు వచ్చి ఎకరం పత్తి చెట్లను నాశనం చేయడం జరిగిందని నేడు శుక్రవారం రోజున 4 గంటలకు తెలిపారు. కావున ఫారెస్ట్ అధికారులు ఈ పంట నష్టాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు.