అనంతపురం నగరంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ దిగ్విజయంగా సాగిందనీ.. రెండు లక్షల మంది వస్తారు అనుకుంటే దాదాపు మూడు లక్షల మంది ప్రజలు తరలి వచ్చారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం 11:30 గంటల సమయంలో నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఎంపీలు ఎమ్మెల్యేలతో పల్లా శ్రీనివాస యాదవ్ మీడియాతో మాట్లాడారు. విజయోత్సవ సక్సెస్ కావడం జీర్ణించుకోలేని వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు రావని బెదిరించి సభకు తీసుకొచ్చారని వైసీపీ విష ప్రచారం చేస్తుందన్నారు.