పల్నాడు జిల్లా క్రోసూరు మండల పరిధిలోని పలు పాఠశాలలో మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులు తింటున్న భోజనాన్ని స్వయంగా తిని, నాణ్యతను పరిశీలించారు. మెనూ సక్రమంగా అమలు చేస్తున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.