శ్రీరామ్ సాగర్ జలాశయం నుండి వరద నీటిని దిగువకు విడుదల చేయడంతో సోన్ గ్రామం వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శుక్రవారం ఉదయం 39 గేట్ల ద్వారా ఐదు లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. దీంతో గోదావరి నది ఉదృతంగా ప్రవహించడంతో పుష్కర ఘాట్, గంగమ్మ తల్లి ఆలయం నీట మునిగిపోయింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరి పొలాలు, మొక్కజొన్న, సోయాబీన్ పంటలోకి వరద నీరు చేరింది. గోదావరి నది వైపు వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.