ఏలూరు జిల్లా భీమడోలు వద్ద పెనుప్రమాదం తృతిలో తప్పింది. భీమడోలు గ్రామం నుంచి ఆటోలో ప్రయాణిస్తున్న ఉపాధిహామీ కార్మికులను(కూలీలను) తరలిస్తున్న ఆటోను భీమడోలు శివారు అయ్యప్పస్వామి ఆలయం వద్ద హైవే పై వెనుక నుంచి ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన ఆటో మరొక ఆటోను ఢీకొట్టి రహదారి పక్కనున్న చెట్టును గుద్దుకుని ఆగింది. ప్రమాదంలో 14 మందికి ఉపాధి కార్మికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఏలూరు, భీమడోలు ప్రభుత్వ ఆసుపత్రికి, చికిత్స నిమిత్తం తరలించారు. భీమడోలు సిఐ విల్సన్, ఎస్ఐ సుధాకర్ ఘటనా స్థలిని పరిశీలించారు.