పెద్ద కడబూరు : మండల కేంద్రం లోని జడ్పీహెచ్ పాఠశాలను డిప్యూటీ డీఈవో వెంకటరమణ రెడ్డి శనివారం తనిఖీ చేశారు.పదో తరగతి విద్యార్థులను ఉద్దేశించి చదువులో రాణించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఉపాధ్యాయులకు మెరుగైన బోధన అందించాలని సూచించారు. అనంతరం పీఎం ఎస్ఆర్ఐ నిధులతో నిర్మిస్తున్న లైబ్రరీ, ల్యాబ్ గదులను హెచ్ఎం ఉమా రాజేశ్వరితో కలిసి పరిశీలించి నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.