జిల్లాలోని అన్ని బంగారు దుకాణాల్లో సీసీ కెమెరాలు, సెన్సార్ ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. మంగళవారం బంగారు దుకాణదారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అనుమానం ఉన్న వ్యక్తుల నుంచి బంగారం కొనుగోలు చేయవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.