ఎరువులు వాడకంపై రైతులు తగిన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆదివారం సంతబొమ్మళిలో రైతులతో సమావేశం నిర్వహించారు. 75 కేజీలు యూరియా బస్తా ఒకేసారి ఇస్తే వెంటనే రైతులు వినియోగిస్తారని, విడతల వారీగా ప్రభుత్వం ఇస్తుందన్నారు.అందుకే మొదటి విడతగా 25 కేజీలు, 2వ విడతగా, 3వ విడతగా అదే లెక్కల్లో యూరియా అందజేస్తామన్నారు. ఎన్ఆర్డి తదితరులు ఉన్నారు.