Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల్లో నెలకొల్పిన గణనాధుల వద్ద కుంకుమార్చన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విగ్రహం ప్రతిష్టించిన మొదటి శుక్రవారం ఉదయం 11 గంటల నుండి రెండు గంటల వరకు కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారాన్ని మహిళలు కొనసాగించారు అత్యంత భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.