Download Now Banner

This browser does not support the video element.

ములుగు: జిల్లా కేంద్రంలో ఎస్పీ ఎదుట ఏడుగురు మావోయిస్టు సభ్యులు లొంగుబాటు

Mulug, Mulugu | Aug 30, 2025
ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ డాక్టర్ శభరిష్ ఐపీఎస్ ఎదుట ఏడు గురు నిషేధిత సిపిఐ మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. నేడు శనివారం రోజున మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు. లొంగిపోయిన వారికి పునరావాసం క్రింద ప్రస్తుతం రూ.25 వేల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... "పోరుకన్న ఊరు మిన్న – మన ఊరికి తిరిగి రండి" అనే అవగాహన కార్యక్రమం ఫలితంగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారని, జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు 80 మంది మావోయిస్టు పార్టీకి చెందిన వివిధ హోదాల్లోని సభ్యులు జనజీవన స్రవంతిలో కలిశారని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us