యూరియా కొరకు రైతులు ఆందోళన చెందవద్దని ఏటూరునాగారం కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రఘు అన్నారు. బుధవారం సాయంత్రం రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులు సూచనల మేరకు నానో యూరియాతో అధిక దిగుబడి వస్తుందని నానో యూరియా అనేది మొక్కలకు నత్రజని అందించడానికి ఉపయోగించే ఒక ద్రవ ఎరువు అన్నారు. ఇది వాడిన రైతులకు మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు.