దేశానికి అంతా అన్నం పెట్టేందుకు రైతన్నలు తన కష్టాన్ని ధారపోస్తుంటారు, రైతన్న కష్టానికి విలువ కట్టకపోవడం ఈ సమాజానికి సిగ్గు చెట్టుగా భావించవచ్చు, గత కొన్ని రోజులుగా వికారాబాద్ జిల్లాలో ఏరియా కొరతతో రైతులు ఫర్టిలైజర్ షాప్ ల వద్ద బారులు తీరుతున్నారు. అందులో భాగంగా నవాబ్ పేట మండల కేంద్రంలో అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద వర్షానికి సైతం లెక్కచేయకుండా యూరియా బస్తాల కోసం పట్టా పాస్ బుక్ చేత పట్టుకొని లైన్లో నిలబడ్డ రైతులు.