తిరుపతి జిల్లా వెంకటగిరిలో దారుణ హత్య కలకలం రేపింది.. వెంకటగిరి రైల్వే స్టేషన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.. మృతుడు అమ్మపాలెం కు చెందిన శివారెడ్డిగా గుర్తించారు.. మద్యం మత్తులోనే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.. గూడూరు డిఎస్పీ గీత కుమారి ఘటనా స్థలనికి చేరుకొని విచారణ చేపట్టారు.. హత్య చేసిన వారిని తొందలోనే పట్టుకుంటామని ఆమె 12 గంటల ప్రాంతంలో తెలిపారు