రాయచోటి పరిసర ప్రాంతంలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం లో చంద్రగ్రహణం నేపథ్యంలో ఆలయ ముఖద్వారం తలుపులు ఈరోజు (07-09-2025) మధ్యాహ్నం 12:30 గంటలకు మూసివేయబడనున్నాయి.తదుపరి 08-09-2025 ఉదయం 5 గంటలకు ఆలయ తలుపులు తిరిగి తెరవబడి, ఆలయమంతటా శుద్ధి చేసి, పుణ్యాహవచనం, సంప్రోక్షణ అనంతరం స్వామివారికి నిత్యాభిషేకాలు నిర్వహించబడతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ డివి రమణ రెడ్డి గారు, ఆలయ అర్చకులు ప్రకటించారు.