కులం పేరుతో దూషించిన మునీరు అహమ్మద్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బాధిత దళిత మహిళతో కలిసి కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆమె ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ— “టూ లెట్ బోర్డు చూసి ఇల్లు బాడుగకు కావాలని వెళ్లిన దళిత మహిళను ఇంట్లోకి పిలిచి మునీరు అహమ్మద్ కులం అడిగాడు. ఆమె మాదిగ అని చెప్పగానే, ‘మాల మాదిగోళ్లకు ఇల్లు ఇవ్వము’ అంటూ అవమానపరిచాడు. అంతేకాదు, మాదిగోళ్లు ఇలాంటివారే అని నీచంగా దూషించాడు. అతని కూతురు కూడా అదే విధంగా తిట్టిందని బాధితురాలు తెలిపింది” అన్నారు.“ఇంట