సైబర్ నేరాల పట్ల ప్రజలు,యువత అప్రమత్తంగా ఉండాలని ఖానాపూర్ ఎస్ఐ రాహుల్ గైక్వాడ్ సూచించారు. శుక్రవారం ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్ కేజీబీవీలో భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొక్సో చట్టం, బాల్యవివాహాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై విద్యార్థులకు వివరించారు. విద్యార్థి దశలో సోషల్ మీడియా మాయలో పడవద్దని సూచించారు. యువత,ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వివరించి అవగాహన కల్పించారు.