అన్నమయ్య జిల్లా పీలేరు వద్ద ఇటీవల బైక్ ను కారు ఢీ కొన్న ఘటనలో గాయపడిన రైల్వే కోడూరు మండలం వివి కండ్రిక గ్రామానికి చెందిన బొజ్జ హనుమంతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆ గ్రామానికి వెళ్లిన ఆయన వారిని కలిసిన పరామర్శించిన, అనంతరం మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడికి కాళ్లు విరిగాయి, భార్యకు నడుము, చెయ్యి విరిగిందని అన్నారు. గిరిజనులు, వ్యవసాయ కూలీలు అయిన వీరు ఏ పని చేసుకోలేని స్థితిలో ఉన్నారని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.