రాష్ట్రంలో పల్నాడు జిల్లా, వినుకొండకే ప్రత్యేక గుర్తింపుగా ఉన్న శ్రీ రామలింగేశ‌్వర స్వామి ఆలయాన్ని మహాపుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతామనీ ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. స్థానిక ప్రజలతో పాటు అటు రాయలసీమ, ఇటు మిగిలిన రాష్ట్ర ప్రజలందరు దర్శించుకుని పూజలు చేసుకునే విధంగా సమష్టికృష్టితో ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన సంకల్పమని చెప్పారు. వినుకొండ రామలింగేశ్వ రస్వామి దేవాలయం, ఘాట్ రోడ్డు నిర్మాణ పనులను శనివారం సాయంత్రం 04 గంటల సమయం లో ఆయన పునఃప్రారంభించారు.