పాతపరదేశీపాలెం నుండి కే నగరంపాలెం రహదారిలో కొండచిలువ కోళ్లను మింగేస్తుండటం స్థానికులు గుర్తించారు. వెంటనే స్థానికులు కొండచిలువను కర్రల సహాయంతో హత మార్చారు. కొండచిలువ సుమారు ఐదు అడుగులు ఉండి మూడు కోడి పిల్లలను మింగేసిందని తెలిపారు. తోటలో కి ఆ సమయంలో ఎవరైనా వెళ్తే మనుషులను మింగేసే ప్రమాదం వుండేదని ప్రమాదకర కొండచిలువను హత మార్చవలసి వచ్చిందని తెలిపారు.