ధర్మవరం పట్టణంలోని కళా జ్యోతి సర్కిల్ వద్ద అన్న క్యాంటీన్ లో భోజనం తినేందుకు వెళుతున్న బాలుడిని ద్విచక్ర వాహనదారుడు వేగంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన నితిన్ అనే బాలుడు నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఆదివారం ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.