ఖమ్మం జిల్లా,కొనిజర్ల మండల కేంద్రంలో యూరియా కోసం ప్రధాన రహదారిపై రైతులు నిరసన చేపట్టారు.కొణిజర్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో యూరియా సరఫరా చేస్తున్నారని సమాచారం అందడంతో ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద ఉదయం 6 గంటల నుంచి రైతులు యూరియా కట్ట టోకెన్ల కోసం బారులు తీరారు రైతులకు 200 మందికి 200 కట్టలు అందజేస్తామని అధికారులు చెప్పటంతో అధికంగా వచ్చిన రైతులు వచ్చిన రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు దీంతో పోలీసులు కలగజేసుకొని రైతులకు నచ్చజెప్పి ధర్నాను విరమింప చేశారు.