గుత్తి లోని ఓల్డ్ సీపీఐ కాలనీలో బుధవారం వినాయక పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులు డాన్స్ ఇరగదీశారు. రాను నేను బాంబే కి రాను అనే పాటకు డ్యాన్స్ వేశారు. చిన్నారుల డాన్స్కు అందరూ ఫిదా అయ్యారు. చిన్నారులను స్థానికులు ఎంతో ఉత్సాహపరిచారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో చిన్నారులు డాన్స్ వేసి అందరినీ మెప్పించారు.