నంద్యాల జిల్లా డోన్ మండలం ఉడుములపాడులో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఆలయ తలుపులు పగలగొట్టి హుండీ ఎత్తుకెళ్లారు. ఇవాళ ఉదయం తలుపులు తెరవడానికి పూజారి ప్రసాద్ వెళ్లగా.. హుండీ దొంగతనం జరిగినట్లు గుర్తించారు. డోన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.