అప్పనపల్లి కాజ్ వే ను ఇంకా గోదావరి వరద ముంపు వీడలేదు. కాజ్ వే పై రెండు అడుగులకు పైగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈ వరద నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో అప్పనపల్లి, బి.దొడ్డవరం, పెదపట్నంలంక గ్రామాలకు చెందిన ప్రజలకు వరద నీటితో అవస్థలు తప్పడం లేదు. స్థానికులు మాట్లాడుతూ వరద సమయంలో అవస్థలు తప్పడం లేదని వాపోయారు.