హైదరాబాదులో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. నిత్యం ఏదో ఒకచోట ఒంటరిగా వెళుతున్న మహిళలు అనే టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్ ఒక పాల్పడుతున్నారు. తాజాగా కొంపల్లి సమీపంలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి కేవీరెడ్డి నగర్ లో మంగళవారం రాత్రి బాలమణి అనే మహిళ మెడలో నుంచి ఐదు తులాల చైన్ లాక్కొని దుండగులు పరారయ్యారు. మరో ఘటనలో ఎన్సీఎల్ కాలనీలోని బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న యువతి మెడలో నుంచి చైన్ స్నాచింగ్ కు యత్నించారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.