Araku Valley, Alluri Sitharama Raju | Aug 26, 2025
పెదబయలు మండలం రూడకోటలో మండల కేంద్రం ఏర్పాటు చేయాలని 12 పంచాయతీల ప్రజలు భారీ ర్యాలీ చేపట్టారు. 12 గ్రామ పంచాయతీల ప్రజలు ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ సురేష్ కుమార్ తో పాటు పలువురు మాట్లాడుతూ.. రూడకోటలో మండల కేంద్రం ఏర్పడితే చుట్టుపక్కల 12 పంచాయతీల ప్రజల కష్టాలు కొంతమేర తీరుతుందని, మండల కేంద్రం ఏర్పాటుకు అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన జరుగుతున్న నేపథ్యంలో రూడకోట ను నూతన మండలం గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.