నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె సమీపంలో ఉన్న అంకిరెడ్డి చెరువును అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. చెరువులో ఉన్న ఎర్రమట్టిని ఎలాంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలు ఉండటం వల్లే మట్టిని తరలిస్తున్నారని రైతులు వాపోతున్నారు. తాజాగా ఆదివారం చెరువు నుండి మట్టిని తరలిస్తున్న 6 టిప్పర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు.